శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 19, 2020 , 13:42:55

దుక్కి దున్నిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి

దుక్కి దున్నిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌ : రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. దేవాదుల కాలువ సందర్శనలో భాగంగా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో మంత్రి, ఎమ్మెల్యే కలిసి రైతులతో ముచ్చటించారు. రైతుల చేతుల్లోంచి వీరిద్దరూ నాగలి తీసుకుని.. కాసేపు దుక్కి దున్నారు. ఎర్రబెల్లి దుక్కి దున్నుతుండగా.. ఎమ్మెల్యే విత్తనాలు నాటారు. అలా వారిద్దరూ కాసేపు రైతులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పొలాల్లో పారిస్తున్నందుకు మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 14 ఏండ్ల కల సాకారమైందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.logo