బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 11:11:42

సరి - బేసి విధానంలో దుకాణాలకు అనుమతి.. బల్దియా పర్యవేక్షణ

సరి - బేసి విధానంలో దుకాణాలకు అనుమతి.. బల్దియా పర్యవేక్షణ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో సరి - బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో బల్దియా అధికారులు పర్యటిస్తున్నారు. దుకాణాలు తెరిచేందుకు బల్దియా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. సరి - బేసి విధానం పాటించకపోతే దుకాణాలు మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణదారు మాస్క్‌ ధరించి శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మాస్క్‌ ధరించిన వినియోగదారుకే సరుకులు ఇవ్వాలని ఆదేశించారు అధికారులు. మాస్కులు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. 


logo