బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 12:19:23

సాహిత్యంతోనూ కరోనాపై యుద్దం

సాహిత్యంతోనూ కరోనాపై యుద్దం

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కనకరాజు కరోనా పై రాసిన పాటని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్‌ లోని మంత్రుల నివాసంలో పాటను  అవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా పై అన్ని రకాల యుద్ధం జరుగుతుందన్నారు. అందులో సాంస్కృతిక యుద్ధం ఒకటి అన్నారు. అనేక మంది కవులు కళాకారులు కూడా తమ కవితలు, పాటలతో కరోనా పై తమ పదునైన పదాల బాణాలను ఎక్కుపెట్టారని అన్నారు. కనక రాజు రాసిన పాట కూడా చాలా బాగుందన్నారు మంత్రి. మరింత మంది కవులు కళాకారులు ఇలాంటి పాటలతో కరోనా కట్టడి కోసం ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు.


logo