శనివారం 06 జూన్ 2020
Telangana - May 18, 2020 , 11:52:29

కేసీఆర్‌, కొప్పుల చిత్రపటానికి పుష్పాభిషేకం

కేసీఆర్‌, కొప్పుల చిత్రపటానికి పుష్పాభిషేకం

జగిత్యాల/పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాలతో వ్యవసాయ పంటలకు నీరందించే కాలువలను నూటికి నూరుశాతం పునరుద్ధరించే ఉద్దేశ్యంతో ధర్మపురి నియోజకవర్గంలో జలహితం కార్యక్రమాన్ని జగిత్యాల, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ లతో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కేసిఆర్‌, కొప్పుల చిత్రపటాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే చెత్త చెదారం, పిచ్చి మొక్కలు,రాళ్ళను శ్రమదానంతో తొలగించం ముఖ్య ఉద్దేశం. ఎస్‌ఆర్‌ఎస్‌పీ మెయిన్‌, సబ్‌ కాలువల స్థితిగతులు, అవసరమైన మరమ్మత్తుల గుర్తింపులు, ప్రతిపాదనలు చేయనున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనీ ప్రతీ కాలువలో సాగునీరు వృధా కాకుండా పారకం జరిగేలా శ్రద్ద వహించే ఆశయంతో రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం.


logo