గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 11:17:36

కేంద్రం పేదలకు 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది

కేంద్రం పేదలకు 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది

సంగారెడ్డి : కష్ట కాలంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ పేదలకు 12  కేజీల బియ్యం, 1500  రూపాయలు పంపిణీ చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 2500 కోట్లను 2 విడతలుగా పేదల అక్కౌంట్లలో వేశారని గుర్తుచేశారు. కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు మంత్రి అన్నారు. కేంద్రం పేదలకు 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది అని అన్నారు మంత్రి. కష్టకాలంలో రాష్ర్టాలు అప్పులు తీసుకునేందుకు కూడా కేంద్రం షరతులు విధించిందన్నారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడమేంటి ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.


logo