గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 19:50:35

కేటీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు బస్సు ఏర్పాటు

కేటీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు బస్సు ఏర్పాటు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి వలస కార్మికులను వారి ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేశారు. కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి కలసి కార్మికులను బస్సుల్లో పంపించారు. మేడ్చల్ పరిధిలో ఉన్న వలస కార్మికులను వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక బస్సుల్లో పంపారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో చర్చించిన అనంతరం వారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు,  మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


logo