సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 14:54:18

పేదలు ఆత్మగౌరవంతో బతుకాలనే ‘డబుల్‌’ ఇండ్లు : మంత్రి హరీశ్ రావు

పేదలు ఆత్మగౌరవంతో బతుకాలనే ‘డబుల్‌’ ఇండ్లు : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆర్థిక శాఖమ మంత్రి హరీశ్‌రావు అన్నారు.  జిల్లాలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో ఆదివారం 50 డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాలు సంబురంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజాశర్మ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి  గృహ సముదాయ ఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఆ తర్వాత జరిగిన సమావేశంలో మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు.  అనంతరంమంత్రి  మాట్లాడుతూ నిరుపేదలకు నిలువెత్తు గౌరవం ఇవాళ రావురూకుల, తోర్నాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నారు.  మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. కాగా, కిరాయి ఇళ్లు, గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా వరమిచ్చారని సంబురంతో.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు పది కాలాలు సల్లంగా ఉండాలని రావురూకుల, తోర్నాల గ్రామ గృహ లబ్ధిదారులు చల్లటి దీవెనలు ఇచ్చారు.


logo