ఆదివారం 31 మే 2020
Telangana - May 16, 2020 , 21:55:32

అగ్ని ప్రమాదంలో పంట నష్టం

అగ్ని ప్రమాదంలో పంట నష్టం

వర్ధన్నపేటలో ఓ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో ప్రమాదవ శాత్తు మెక్కజొన్న తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిరంజీవి అనే రైతుకు చెందిన 3 ఎకరాలలో మెక్కజొన్న పంట సాగు చేశాడు.  కోసిన పంటను ఒక దగ్గరకు చేసి జూళ్లు వేశాడు. కాగా ఈ రోజు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పండించిన పంట మొత్తం కాలిపోయింది. దీంతో రూ. 1.50 లక్షల విలువ చేసే పంట దగ్ధం అయింది. దీంతో రైతు తీవ్ర విషాదంలోకి చేరుకున్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విఙ్ఞప్తి చేసాడు రైతు.


logo