శనివారం 30 మే 2020
Telangana - May 16, 2020 , 16:47:48

జర్నలిస్టుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శ

జర్నలిస్టుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శ

సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రముఖ తెలుగు దిన పత్రికలో బ్యూరో ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్న మెండు శ్రీనివాస్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. మెండు శ్రీనివాస్‌ తల్లి రాజమ్మ శుక్రవారం మరణించిన నేపథ్యంలో నేడు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ కలిసి వారి నివాసానికి వెళ్లి రాజమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


logo