శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 15:10:19

హైదరాబాద్‌ అతలాకుతలం.. రోడ్లపై విరిగిపడ్డ చెట్లు

హైదరాబాద్‌ అతలాకుతలం.. రోడ్లపై విరిగిపడ్డ చెట్లు

హైదరాబాద్‌ : శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ మహానగరం అతలాకుతలమైంది. అరగంట పాటు వాన దంచికొట్టింది. భారీ ఈదురుగాలులతో వర్షం కురియడంతో.. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గాలి వాన బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.


భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రోడ్లపై విరిగిపడ్డ చెట్లను తొలగిస్తున్నారు. వర్షపు నీరు ఎక్కడా కూడా నిలవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములో నింబస్‌ మేఘాల ఏర్పడి అకాల వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో.. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.  logo