ఆదివారం 31 మే 2020
Telangana - May 15, 2020 , 22:46:18

సీఎంకు రక్త దాతల జాబితా

సీఎంకు రక్త దాతల జాబితా

కరోనా, ఇతర రోగుల వైద్యం కోసం నర్సంపేట నియోజకవర్గం నుంచి 5610 మంది సభ్యుల రక్తదాతల జాబితాను అందించారు నర్సంపేట శాసన సభ్యులు పెద్ది రెడ్డి సుదర్శన్‌ రెడ్డి. ఈ రోజు కరోనా, అనేక మంది రోగులకు చికిత్సలో అత్యవసరమయ్యే రక్తం ఇచ్చేందుకు రక్త దాతలు కరువవుతున్నందున మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి తన నియోజకవర్గంలో రక్త దాతల వివరాలు సేకరించిన జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు.


logo