శనివారం 30 మే 2020
Telangana - May 15, 2020 , 22:34:48

వలస కూలీలు, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

వలస కూలీలు, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

బంజారా మహిళా ఎన్జీఓ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కరోనా విపత్తు నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ర్టాలలో సహాయక శిబిరాలు, ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డాక్టర్‌ ఆనంద్‌, తన మిత్రులు దివ్య రావెళ్ల, ఇంకా మిత్ర బృందంతో కలిసి హైదరాబాద్‌లోని మురికివాడలు, బస్తీలలో, ఢిల్లీలోని వలస కూలీలు, పేదవారి కోసం నిత్యావసర వస్తువులను అందించారు. ఒక సామాజిక కార్యకర్తగా, డాక్టర్‌గా తాను సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశానని, నాయకులు, మంత్రులు దేశానికి అవసరమని, ఆయన భార్య కావ్య కూడా చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటించి, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని పేద ప్రజల కోసం అందించాలన్నారు ఆనంద్‌. 


logo