శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 21:18:23

ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా...

ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా...

మాదన్నపేటలోని ఓ ఇంట్లో ఏకంగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆర్‌ఆర్‌ మిడోస్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబంలో ఆరుగురికి  పాజిటివ్‌ రావడం ఆ ప్రాంతంలోని వారిలో కలకలం రేపుతుంది. కుటుంబంలోని 63 ఏళ్ళ ఓ వృద్ధునికి, 62 ఏళ్ళ అతడి భార్యకు, వారి కుమారుడు(37), కుమారుని 8, 4 ఏళ్ల కుమారులతో పాటు ఆ ఇంట్ల్లో పనిచేసే 34 ఏళ్ళ మహిళకు కూడా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  

ఇదే అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తులో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈ నెల 10న కరోనా పాజిటివ్‌ అని తెలియగా, బుధవారం అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కూడా పాజిటివ్‌ అని తేలింది. అతడి భార్య, కూతురుతో పాటు మొత్తం 11 మందిని క్వారంటైన్‌కు తరలించగా వీరిలో ఆరుగురికి  పాజిటివ్‌ వచ్చింది.


logo