గురువారం 28 మే 2020
Telangana - May 15, 2020 , 14:34:58

ధర్మసాగర్ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలి

ధర్మసాగర్ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలి

నిర్మల్ : ధర్మసాగర్ చెరువు సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి  చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ      నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ధర్మసాగర్ చెరువు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని నీటిని మొత్తం విడుదల చేసి అందులో ఉన్న  గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలన్నారు.  చెరువు చుట్టూ పరిసరాల పరిశుభ్రత తో పాటు పచ్చదనంపెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ నిర్మల్  మున్సిపల్ కార్యాలయం ముందర పచ్చదనం, అభివృద్ధి పనులకు కార్యాచరణ  ప్రణాళికలు రూపొందించి  వెంటనే పనులను ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.


logo