బుధవారం 27 మే 2020
Telangana - May 15, 2020 , 13:56:27

తల్లడిల్లిన తల్లిపేగు!

 తల్లడిల్లిన తల్లిపేగు!

అప్పటి వరకు అమ్మ వెనుకే తిరిగి అల్లరి చేసిన వానర కూన చని పోవడంతో దాని తల్లికి ఏంచేయాలో తెలియలేదు.   ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇటీవల ఓ కోతికి జన్మించిన పిల్ల మృతిచెందింది. అయితే.. మాతృప్రేమకు ప్రతిరూపంగా ఆ వానరం చనిపోయిన తన బిడ్డను చంకనెత్తుకొని తిరుగుతున్నది. నైతిక విలువలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఓ మూగజీవి చనిపోయిన తన బిడ్డపై చూపుతున్న ప్రేమ.. తల్లి పేగు బంధాన్ని చూపుతున్నది. 

కోతులు ముఖ్యంగా దేవాలయాల వద్ద ఎక్కువగా ఉంటాయి. లాక్‌డౌన్‌తో టెంపుల్స్‌కు భక్తులు రావడం బందయింది. దీంతో కోతులకు తిండి దొరకడం లేదు. గుడికొచ్చినవారు ఎదైనా ఇస్తే తిని కడుపు నింపుకునే కోతులకు కరోనాతో కష్టాలు మొదలయ్యాయి. తిండి దొరక్క కొన్ని చనిపోతున్నాయి. 


logo