బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 21:08:36

ఎల్‌ఈడీ స్ట్రీప్‌ లైటింగ్‌తో కొత్త అందాలు

ఎల్‌ఈడీ స్ట్రీప్‌ లైటింగ్‌తో కొత్త అందాలు

జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణానికి అందంగా తీర్చిదిద్దేడమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ 10 లక్షల వ్యయంతో ఎల్‌ఈడీ స్ట్రిప్‌( రోలింగ్‌) లైటింగ్‌ ను చైన్‌ గేట్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్‌ పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో  జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన విధంగా నిర్మల్‌ మున్సిపాలిటీలో మంచిర్యాల్‌ చౌరస్తా నుండి బైల్‌ బజార్‌ వరకు 220 పోల్స్‌కు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ట్రీప్‌ (రోలింగ్‌) లైటింగ్‌ అమర్చినట్లు ఆయన తెలిపారు. ఎల్‌ఈడీ స్ట్రీప్‌ లైటింగ్‌తో పట్టణానికి కొత్త అందాలు వచ్చాయన్నారు.



logo