శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 20:56:23

కొనసాగుతున్న వలస కార్మికుల తరలింపు...

కొనసాగుతున్న వలస కార్మికుల తరలింపు...

యాదాద్రి భువనగిరి: కరోనా నేపద్యంలో తెలంగాణలో చిక్కుకుపోయిన ఇతర రాష్ర్టాల వలస కార్మికులను అధికారులు సురక్షితంగా తరలిస్తున్నారు. ఇందులో భాగంగా బీబీనగర్‌ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో ఒడిశా రాష్ర్టానికి వలస కార్మికులను తరలిస్తున్నారు జిల్లా అధికారులు. యాదాద్రి జిల్లాతో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గల దాదాపు 1500 మందికి పైగా వలస కార్మికులను తరలిస్తున్నట్లు పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఏసీపీ భుజంగరావు, డీఆర్డీఓ ఉపెందర్‌ రెడ్డి, సీఐ సురేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ వెంకట్‌ రెడ్డి, ఎంపీడీవో శ్రావణ్‌ కుమార్‌ రెడ్డిలు తరలింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


logo