బుధవారం 27 మే 2020
Telangana - May 14, 2020 , 20:49:59

ఐజ-కర్నూలు.. రూ.1,75 లక్షల మద్యం అక్రమ రవాణా... స్వాధీనం

ఐజ-కర్నూలు.. రూ.1,75 లక్షల మద్యం అక్రమ రవాణా... స్వాధీనం

జోగుళాoబ గద్వాల్ జిల్లా ఐజ మండలం నది తీర గ్రామాల నుంచి కర్నూలు ప్రాంతానికి మద్యంను అక్రమంగా తరలిస్తున్న 9 మంది ముఠాను పట్టుకున్నారు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. ఇందులో భాగంగా రూ.1,75లక్షలు(1389 బాటిళ్లు)  విలువ గల మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు వాడిన 8 వాహనాలను సీజ్‌ చేసి 9 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 

ఐజ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మద్యం షాప్‌లలో మద్యం కొనుగోలు చేసి నది తీర గ్రామాల నుండి నది అవతలి వైపు ఉన్న కర్నూల్‌ జిల్లా గ్రామాల వారికి అధిక రేట్లకు అమ్మేందుకు రహస్య మార్గం గుండా అక్రమంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలపై మద్యంను తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు బారి మొత్తంలో మద్యం పట్టుకున్నారు.


logo