గురువారం 04 జూన్ 2020
Telangana - May 14, 2020 , 20:30:58

ఇది నిరుత్సాహ ప్యాకేజీ...

ఇది నిరుత్సాహ ప్యాకేజీ...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ-2 పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తన స్పందన తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీలు చాలా నిరుత్సాహ పరచాయన్నారు. కేంద్ర మంత్రి ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు వినోద్‌ కుమార్‌. బ్యాంకులు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నాయని, ఇక ప్రజలకు ఏం సాయం చేస్తాయని ప్రశ్నించారు. ప్యాకేజీ-2 సఫలం అయ్యేలా లేదని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. రానున్న 3-4 ఏళ్ల దాకా రెంటల్‌ అకామడేషన్‌ సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదని తెలిపారు. నాబార్డు రీ ఫైనాన్స్‌ స్కీంలు కొత్త సీసాలో పాత సారా చందంగా ఉన్నాయని ఎద్దేవా చేసారు. కాంపా నిధులు ఏ మేరకు సాయ పడతాయని ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. కేంద్ర వైఖరి చూస్తుంటే ప్లేయింగ్‌ టు గ్యాలరీ లాగా ఉందన్నారు వినోద్‌ కుమార్‌.


logo