బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 18:39:19

చేపమందు ప్రసాదం లేదు...

చేపమందు ప్రసాదం లేదు...

కరోనా ప్రభావం చేప మందు కార్యక్రమంపై కూడా పడింది. అస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్యాస సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం కరోనా కారణంగా ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిన హరినాథ్‌ గౌడ్‌ ఈ రోజు ప్రకటించారు. ఈ మేరకు హరినాథ్‌ గౌడ్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని వినతిపత్రం అందజేశారు. ఏటా దేశ విదేశాల నుంచి వేలాది మంది చేప మందుకోసం హైదరాబాద్‌ వస్తుంటారని, ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరూ రావొద్దని హరినాథ్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, ఇందుకు హరినాథ్‌ గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. స్వయం నియంత్రణ, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడంతోనే కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. logo