బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 15:45:14

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల 3 రోజుల్లో రాష్ర్టానికి వర్ష సూచన!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల 3 రోజుల్లో రాష్ర్టానికి వర్ష సూచన!

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారింది. రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం మరింత బలపడి 16వ తేదీ సాయంత్రానికి తుపానుగా మారే సూచన ఉంది. మే 17 నాటికి వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. మే 18 నుంచి 19 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


logo