బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 15:43:10

మ‌నో వికాస కేంద్రం సేవ‌లు అభినంద‌నీయం

మ‌నో వికాస కేంద్రం సేవ‌లు అభినంద‌నీయం

వరంగల్ అర్బన్ : మ‌ల్లికాంబ మ‌నోవికాస సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మాన‌సిక దివ్యాంగుల‌కు అందిస్తున్న సేవ‌లు ఎంతో విలువైన‌వ‌ని, మాన‌వీయ‌త‌తో కూడిన‌వ‌ని అన్నారు. త‌మ ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో  నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను మంత్రి మ‌నోవికాస కేంద్రానికి అందించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, మాన‌వ సేవే మాధ‌వ సేవ అనే లక్ష్యంతో ప‌ని చేస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు త‌గ్గిపోతున్న‌ద‌న్నారు. పిల్ల‌లు, వృద్ధులు, మాన‌సిక‌, ఇత‌ర దివ్యాంగుల‌కు సేవ‌లు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

అలాంటి సేవ చేస్తున్న సంస్థ‌ని మంత్రి అభినందించారు. త‌మ‌కు తోచిన విధంగా సాయం అందిస్తున్నామ‌ని, ఇంకా అనేక మంది దాతలు తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద‌ల‌కు, దివ్యాంగుల‌కు అందించి ఆదుకోవాల‌ని పిలుపునిచ్చారు. అలాగే ప్రమాదానికి గురైన‌ క‌ళ్యాణ‌ల‌క్ష్మి షాపింగ్ మాల్ ని ప‌రిశీలించారు. అగ్ని ప్ర‌‌మాదానికి కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని, షాప్స్ య‌జ‌మానులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకునేలా చైత‌న్య ప‌ర‌చాల‌ని పోలీసు అధికారుల‌ను దేశించారు.


logo