మంగళవారం 26 మే 2020
Telangana - May 13, 2020 , 20:56:33

పేలుడు పదార్థాలు స్వాదీనం...

పేలుడు పదార్థాలు స్వాదీనం...

ఖమ్మం టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావుకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  ఖమ్మం రూరల్‌ డివిజన్‌లోని ముదిగొండ  మండలం కస్నాతండా చెందిన  జంపయ్య నిబంధనలు అతిక్రమించి చట్ట విరుద్ధంగా తన వద్ద వున్న కంప్రెషన్‌ ట్రాక్టర్‌ ద్వారా డిటోనేటర్లు, జిలిటెన్‌ స్టిక్స్‌ ఉపయోగించి బండరాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ రవికుమార్‌ , ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తమ సిబ్బందితో సోదాలు నిర్వహించారు. 90 డిటోనేటర్లు, 83 జిలిటెన్‌ స్టిక్స్‌, 150 మీటర్ల లీడింగ్‌ వైర్‌, బ్లాస్టింగ్‌కు ఉపయోగించే స్టార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గూడురుపాడు గ్రామానికి చెందిన  మహేష్‌, శ్రీను వద్ద నుంచి  400 డిటోనేటర్లు, 40 కేజీల పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు తెలడంతో వీరిపై  చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.


logo