గురువారం 04 జూన్ 2020
Telangana - May 13, 2020 , 17:53:19

కాంగ్రెస్‌, బీజేపీలవి పిచ్చి మాటలు, పచ్చి రాజకీయాలు

కాంగ్రెస్‌, బీజేపీలవి పిచ్చి మాటలు, పచ్చి రాజకీయాలు

కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాలలో పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు

ఎక్కడైనా ఆ రెండు పార్టీల పాలిత రాష్ర్టాల్లో పంటలు కొనుగోలు చేస్తున్నారా?

కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీలవి పిచ్చి మాటలు, పచ్చి రాజకీయాలని, నైతిక లేకుండా ఆ పార్టీల నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాలలో పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు. ఈ కరోనా సమయంలో రైతుల పంటలను కొనే దిక్కులేదని ఆయన అన్నారు. ఎక్కడైనా ఆ రెండు పార్టీల పాలిత రాష్ర్టాల్లో పంటలు కొనుగోలు చేస్తున్నారా? చెప్పమనండి? అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకున్న మహాత్ముడు సీఎం కేసీఆర్‌ అని ఎర్రబెల్లి అన్నారు.  ఇంత కష్టకాలంలో కూడా రైతులకు అండగా నిలుస్తుంటే... కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశంలోనే కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, సీఎం కేసీఆర్‌ చర్యల వల్లనే కరోనా వైరస్‌ కట్టడిలో ఉందని మంత్రి చెప్పారు. రైతులను రాజుగా చూడాలనేదే సీఎం కెసిఆర్‌ ధ్యేయమన్నారు. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌, పంటల పెట్టుబడుల రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోలు, రుణమాఫీ ఇన్ని రకాల పథకాలున్న రాష్ట్రం దేశంలోనే లేదన్నారు. సాధ్యమైతే మంచి సలహాలివ్వాలని ప్రతిపక్షాలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు.


logo