మంగళవారం 26 మే 2020
Telangana - May 13, 2020 , 17:32:20

వలస కూళీల ఆకలి తీర్చిన యువత

వలస కూళీల ఆకలి తీర్చిన యువత

మానవత్వంతో వలస కూళీల ఆకలి తీర్చారు సత్యనారాయణపురం యువత.  భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నుంచి బయలుదేరి గోదావరి దాటి చర్ల , ఛత్తీస్‌ గ్‌డ మీదుగా జార్ఖ్‌ండ వెళ్ళడానికి 95 మంది వలస కూళీలు బయలుదేరారు. సత్యనారాయణపురం చేరుకోగానే ఆకలిదప్పికలతో సొమ్మసిల్లి రహదారి ప్రక్కన దీన స్థితిలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ కూళీలు. దీన్ని గమనించిన గ్రామ యువకులు వారి ఆకలి తీర్చేందుకు వెంటనే వంటలు చేయించి వారికి అన్నం పెట్టారు. తేగడ గ్రామానికి చెందిన బండి బాబీ, చింతల రాంబాబు, పాగ అశోక్‌, తడికల నితీష్‌, చింతల రాజేష్‌, లోకేష్‌ అనే యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి వంట చేయించి 95 మందికి భోజనాలు పెట్టారు.


logo