బుధవారం 27 మే 2020
Telangana - May 13, 2020 , 12:23:09

కడుపు నిండా తిండిపెట్టి..తొవ్వ ఖర్చులకు పైసలిచ్చి..

కడుపు నిండా తిండిపెట్టి..తొవ్వ ఖర్చులకు పైసలిచ్చి..

హైదరాబాద్ : లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కూలీలు అష్టకష్టాలు పడుతూ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఆకలికి అలమటిస్తూ కన్నీళ్లను దిగమింగుతూ దారెంట పగలనకా రాత్రనకా గమ్యం చేరేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇలా రాజ‌మండ్రి నుంచి బ‌య‌లు దేరి..వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం మైలారం వ‌ద్ద ఆగిన మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులన చూసి చలించిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారిని ఆదరించి అక్కున చేర్చుకున్నారు. కడుపు నిండా భోజనం పెట్టి ఆర్థిక స‌హాయం అందజేశారు. మంత్రి కలెక్టర్‌తో  మాట్లాడి వారికి కావాల్సిన రవాణా స‌దుపాయాల‌పై చ‌ర్చించారు.  వారు తమ సొంతంగా ద్విచ‌క్ర వాహ‌నాల‌పై వెళ్తామని చెప్పడంతో వారికి మాస్కులు అందజేసి పంపించారు.


logo