సోమవారం 01 జూన్ 2020
Telangana - May 13, 2020 , 11:01:40

ఆపదలో అండగా ఉందాం : మంత్రి ఎర్రబెల్లి

ఆపదలో అండగా ఉందాం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్: కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు.  జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని లక్ష్మి గార్డెన్స్ లో ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ  పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు తో కలిసి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.


logo