బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 02:19:19

ఇంటర్‌స్పాట్‌కు అనుమతి

ఇంటర్‌స్పాట్‌కు అనుమతి

జాగ్రత్తలు పాటించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ పరీక్షల సమాధాన పత్రాల ముల్యాంకనానికి హైకోర్టు అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో మా స్కులు, శానిటైజేషన్‌, భౌతికదూరం నిబంధనలు, ఇతర జాగ్రత్తలు పాటించాలని ఇంటర్‌బోర్డును ఆదేశించింది. స్పా ట్‌ వాల్యుయేషన్‌ చేపట్టాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేటకు చెందిన కే ఓంప్రకాశ్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఇం టర్‌ ఎగ్జామ్స్‌పై ఆధారపడి ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, ఇంటర్‌ ఫలితాలు వెలువడితేనే ఆయా పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ వాదనలను తోసిపుచ్చిన హై కోర్టు.. స్పాట్‌ వాల్యుయేషన్‌ కోసం జా గ్రత్తలు పాటించాలని ఇంటర్‌బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలపాటు వాయిదా వేసింది.

ప్రారంభమైన ఇంటర్‌ వాల్యుయేషన్‌ 

లాక్‌డౌన్‌ కారణంగా అర్ధంతరంగా నిలిచిన ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ మంగళవారం తిరిగి మొదలైంది. తొలిరోజు 4,350 మంది అధ్యాపకులు (ఎగ్జామినర్లు) హాజరైనట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  తొలిరోజు ఇంగ్లిష్‌, గణితం, సివిక్స్‌ సబ్జెక్టుల పేపర్లు దిద్దినట్టు అధికారులు తెలిపారు.  

త్వరలో టెన్త్‌ పరీక్షలపై అఫిడవిట్‌.

రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలను హైకోర్టు మ ధ్యలో నిలిపివేసినందున తిరిగి ప్రారంభించేందుకు అనుమతి కోసం రెండురోజుల్లో అధికారులు అఫిడవిట్‌ దాఖలు చేయనున్నారు. అందుకోసం జిల్లాలవారీగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల నివేదికలను సిద్ధంచేశారు.


logo