బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 22:31:21

ఆమె... విరామమెరుగని గడియారం..

ఆమె... విరామమెరుగని గడియారం..

విరామమెరుగని శ్రమైక గడియారం ‘నర్స్‌' అంటూ ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య ప్రకాష్‌ ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా నర్సులను సిస్టర్‌ అని సంబోధించాలని, వారి సేవలు అజరామరం అని, వారు విరామం, విశ్రాంతి తీసుకోకుండా గడియారం మాదిరిగా నిరంతరం పని చేస్తూనే ఉంటారని, శ్రమైక జీవులని నర్సులను ప్రశంసిస్తూ వారిపై ఒక ప్రత్యేక రచన చేసి, ఆ నేపథ్యంలో ఒక వీడియోను అద్భుతంగా చిత్రించారు.

 “సిస్టర్‌ అని పిలవాలనిపించదు.. వయస్సులో చిన్నదానివే కావొచ్చు.. మనస్సులో మాత్రం ఎంతో పెద్ద దానివి. అంతరంగంలో అనేక అలజడులున్నా.. అణువంతైనా ముఖంలో గాని, మాటల్లో గాని కనిపించకుండా ముందుకు కదిలే వృత్తి ధర్మపు దన్వంతరిణివి.. విరామమెరుగని శ్రమైక గడియారానివి.. అలుపు అనాసక్తిని దరి చేరనీయకుండా పగలూ రేయీ.. పనిలో నిమగ్నమై.. పరిగెడుతూనే ఉంటావు.. వృత్తినే దైవంగా భావిస్తూ మమ్మల్ని ఓ కంట కనిపెడ్తూ ఉంటావు.. నీ గురించి నీవు ప్రత్యేకంగా పట్టించుకోవు.. నీ కుటుంబ సభ్యుల్ని అదే పనిగా అసలు గుర్తు చేసుకోవు.. జగమంత కుటుంబం నీదిగా.. నవ్వుల నదిగా పువ్వుల మదిగా దవళ వస్త్రంతో ఆసుపత్రిలో నడయాడే దేవదూతవు”

 అని ప్రత్యేక కవిత రాసి, దానిని ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా వీడియో షూట్‌ చేశారు. ప్రపంచంలోని నర్సులందరి సేవలను ప్రశంసిస్తూ.. సాహిత్య ప్రకాష్‌ తనదైన ధోరణిలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో యూ ట్యూబ్‌, సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. logo