శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 12, 2020 , 22:01:35

పోలీసులకు కవర్‌ షీల్డ్‌ మాస్కులు

పోలీసులకు కవర్‌ షీల్డ్‌ మాస్కులు

కరోనా నివారణలో భాగంగా రుషిత చారిటబుల్‌ ట్రస్ట్‌ జనతా కర్ఫ్యూ నుంచి నిరంతరంగా సేవలందిస్తోంది. ఈ ట్రస్ట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ తొడుపునూరి సతీష్‌ దంపతుల సహకారంతో ఎల్బీనగర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 100 కవర్‌ షీల్డ్‌ మాస్క్‌లను మంగళవారం పంపిణీ చేశారు. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, నాగోల్‌, కొత్తపేటల పరిధులలో విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ ఎల్బీనగర్‌ అదనపు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజపల్లి నాగమల్లు ఈ మాస్క్‌లను అందించారు. జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటి వరకు రుషిత చారిటబుల్‌ ట్రస్ట్‌ చేస్తున్న సహాయ కార్యక్రమాలు అభినందనీయమని ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు అన్నారు. logo