శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 21:19:03

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరా పేట మండలం నందిపాడులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాడాల గ్రామానికి చెందిన కోరు రాజేష్‌ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రాజేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు రాజేష్‌ను డీకొట్టిన వాహనం పరారీలో ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం తెలుసుకున్న ఎస్‌.ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


logo