సోమవారం 01 జూన్ 2020
Telangana - May 12, 2020 , 21:11:14

వీడియో కాన్ఫరెన్స్‌ లో తీర్పు

వీడియో కాన్ఫరెన్స్‌ లో తీర్పు

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సత్తుపల్లి న్యాయస్థానం జిల్లాలో తొలి వీడియో కాన్ఫరెన్స్‌ తీర్పును వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన గుజ్జుల నాగేశ్వరరావు 2016 లో తన భార్యను హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సత్తుపల్లి నాల్గవ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసును మంగళవారం న్యాయమూర్తి సాయి భూపతి వీడియో కాన్ఫరెన్స్‌లో వాదోపవాదనలు విన్నారు. అనంతరం న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తొలిసారి తీర్పునివ్వడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రథమమని సీఐ రాజగోపాల్‌  చెప్పారుlogo