బుధవారం 27 మే 2020
Telangana - May 12, 2020 , 19:45:17

రేషన్ దుకాణాల్లో తనిఖీలు

రేషన్ దుకాణాల్లో తనిఖీలు

ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయాల్సిన రేషన్ దుకాణాల్లో బియ్యం అక్రమ నిల్వలను రెవెన్యూ అధికారులు మంగళవారం గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం సున్నం బట్టి రేషన్ దుకాణాల్లో సివిల్ సప్లై అధికారి శివకుమార్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన రేషన్ డీలర్ తిరుపతి రావు పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు.


logo