శనివారం 30 మే 2020
Telangana - May 12, 2020 , 19:32:07

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల మరమ్మత్తులపై మంత్రి సమీక్ష

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల మరమ్మత్తులపై మంత్రి సమీక్ష

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్‌, ధర్మారం మండలాల్లో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలవల(కెనాల్‌)పై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలాలలో గల ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మేన్‌, సబ్‌, కాలవలను మరమ్మత్తు పనులు కార్యక్రమం 18 తేది సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ఈ పనుల నిరంతరంగా 15 రోజులు పాటు జరుగుతాయని తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఐబీ, ఉపాధి కార్మికులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్యాక్స్‌ చైర్మన్లు, రైతులు, నాయకులు భాగస్వామ్యులు కావాలన్నారు.

మొట్టమొదటి సారిగా ధర్మపురి నియోజకవర్గంలోనే ఈ కాల్వల మరమ్మత్తుల,శుభ్రం చేసే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కాలువలలోని పిచ్చిమొక్కలు,రాళ్లు, తొలగించాలి, మరమ్మత్తులు జరగాలని ఆదేశించారు, గతంలో కాలువలు బాగున్నప్పటికి నీరువచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి ప్రణాళికతో నేడు ప్రతి గ్రామానికి కాళేశ్వరం జలాలు అందుతున్నాయన్నారు మంత్రి. కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.


logo