శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 22:51:16

భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య

భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య

జగిత్యాల : భర్త తన కళ్లెదుటే విద్యుత్‌ షాక్‌తో మరణించగా.. సంతానం ఎవరూ లేకపోవడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని భర్తకు భార్య అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపల్లికి చెందిన మ్యాకల అంజయ్య (42), అద్దెకుంటున్న ఇంట్లో టార్చ్‌లైట్‌ కు చార్జింగ్‌ పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పిల్లలు ఎవరూ లేకపోవడంతో అతడి భార్య పద్మ అన్నీతానై అంత్యక్రియలు చేసింది. ఒంటరిగా మారిన పద్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సంఘటనా స్థలాన్ని మల్యాల పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 


logo