సోమవారం 01 జూన్ 2020
Telangana - May 11, 2020 , 20:14:43

31 లోపు ఆస్తి పన్ను చెల్లించాలి : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

31 లోపు ఆస్తి పన్ను చెల్లించాలి : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ : ఈ నెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను చెల్లించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎర్లీబర్డ్‌ పథకం కింద 5 శాతం పన్ను రాయితీ పొందండి అని నగర వాసులకు కమిషనర్‌ సూచించారు. 2020-21 ఆస్తి పన్ను వార్షిక డిమాండ్‌ రూ. 1,456 కోట్లు అని ఆయన తెలిపారు. ఎర్లీ బర్డ్‌ కింద సోమవారం వరకు వసూలైన ఆస్తి పన్ను రూ. 167 కోట్లు అని కమిషనర్‌ స్పష్టం చేశారు. పన్ను ప్రయోజనాల పరిమితిని ప్రభుత్వం తొలగించిందని కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 


logo