గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 13:48:03

సీఎం చిత్రపటానికి మ‌ంత్రి అల్లోల క్షీరాభిషేకం

 సీఎం చిత్రపటానికి మ‌ంత్రి అల్లోల క్షీరాభిషేకం

నిర్మల్‌ : సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు. రూ.25 వేలలోపు పంట రుణాలమాఫీతో రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకు గానూ మంత్రి అల్లోల‌, ఎమ్మెల్యే రేఖా నాయ‌క్, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం రూ. 8,210 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతి అని అన్నారు.  ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్  రైతాంగ సంక్షేమానికి నిధులు విడుదల చేశార‌ని తెలిపారు. logo