ఆదివారం 31 మే 2020
Telangana - May 11, 2020 , 00:30:55

ఒంటరితనాన్ని జయించండిలా!

ఒంటరితనాన్ని జయించండిలా!

అనేక కారణాల వల్ల క్వారంటైన్‌ కాలంలో ఒంటరిగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు. రెండో మనిషి కూడా లేకుండా ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య  గడపాలంటే కొంచెం కష్టమే. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు నిపుణులు. 

  •  ఒంటరి జీవితం. రోజంతా లాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ ముందు కూర్చుంటారు. పగలూ, సాయంత్రాలకు తేడా తెలియకుండా అయిపోతారు. అందుకే బోర్‌ ఫీలవుతారు. టైమ్‌కి తినాలి. ఆఫీసు లాగానే టైమ్‌ ఫిక్స్‌ చేసుకుని పనంతా చకచకా చేసేసుకోండి. కిటికీలు ఓపెన్‌ చేసి, ప్రకృతిని ఆస్వాదించండి. 
  • మనుషులకు దూరమైన భావన నుంచి బయటపడటానికి వర్చువల్‌గా కుటుంబ సభ్యులతోనే కాదు, ఆత్మీయులందరితోనూ టచ్‌లో ఉండండి. చిన్ననాటి ఫ్రెండ్స్‌, వేలు విడిచిన బంధువులతో సహా ప్రతి ఒక్కరికీ ఫోన్‌ చేసి మాట్లాడండి. 
  • వ్యాయామం మానొద్దు. కొత్త వ్యాయామాల్ని ఆన్‌లైన్‌లో చూసి ప్రాక్టీస్‌ చేయవచ్చు. జంపింగ్‌ జాక్స్‌, స్కాట్స్‌, సిటప్స్‌, పుషప్స్‌ లాంటివి చేయవచ్చు. 
  • కుటుంబంతో కలిసి ఉన్న సమయంలో ఎక్కడివక్కడ సర్దుకుని శుభ్రంగా పెట్టుకుంటాం. కానీ ఒక్కరమే ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోం. కిచెన్‌ సహా అన్ని గదులూ శుభ్రంగా, చిందరవందర లేకుండా అందంగా పెట్టుకోండి. 
  • మీలో కలుగుతున్న భావనలన్నింటినీ పేపర్‌ మీద పెట్టండి. ఇందుకోసం ఒక నోట్‌బుక్‌ ప్రత్యేకంగా పెట్టుకోండి. మీ మనసులో ఉన్నదంతా పుస్తకంలో రాస్తే ఒత్తిడి ఉండదు. మీకు మీరు సమర్పించుకునే నివేదిక ఇది.  


logo