గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 21:03:51

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో కరోనా సేవలు

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో కరోనా సేవలు

కరోనా మహమ్మారి వ్యాధి నుండి తమను తాము రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో చాలా మంది బీద వారికి మాస్కులు కొనేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా లాక్‌డౌన్‌తో పనులు లేకపోవడంతో ఆదాయం లేక ఇంట్లో సరుకులు కొనేందుకు కూడా చాలా మంది పేదలు, కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వారిని అనేక సేవా సంస్థలు ఆదుకుంటున్నాయి. 


ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ రగడం పల్లి శ్రావణ్ రాజేంద్రనగర్‌లో పలువురు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసారు. అలాగే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు తన వంతుగా వెయ్యి మాస్కులు అందజేసారు. మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో సేవా కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి ముందుంటుందన్నారు శ్రావణ్‌. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, జాగృతి నాయకులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. 


logo