శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 19:47:17

చెక్కులు అందజేసిన ఎర్రబెల్లి

చెక్కులు అందజేసిన ఎర్రబెల్లి

కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సహకారంగా అనేక మంది తమ వంతుగా ఆర్థిక సాయాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సీఎం సహాయ నిధికి అందజేయాల్సిందిగా లక్కమారి కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు చెక్కును అందజేశారు. తనకు అందచేసిన రూ.3,45,197 చెక్కును, అలాగే రూ. 25,590 మరో చెక్కును ఈ రోజు (శనివారం) ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌కు అందచేశారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా కేటిఆర్‌ వారిని అభినందించారు.


logo