శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 17:40:37

విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి

విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి మృతి


ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మందా కొండయ్య(41)వెంకటాపురం సమీపంలోని మామిడి తోటలో జీవాలకు నీళ్లు తాపేందుకు పంపు మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాద వశాత్తు విద్యుత్తు షాక్ కు గురయ్యాడు. దీంతో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


logo