శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 16:06:28

వృద్ధాశ్రమంలో ఎస్పీ నిత్యావసరాల పంపిణీ...

వృద్ధాశ్రమంలో ఎస్పీ నిత్యావసరాల పంపిణీ...

నిర్మల్: నిర్మల్ పట్టణంలోని సోమవారపుపేట్‌లోని వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు సందర్శించి అక్కడ ఉన్న వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యవసర సరుకులలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృద్ధాప్యానికి రాక తప్పదని అందరూ ఉండి అనాధల అత్తమామలను తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడం మంచి పద్ధతి కాదన్నారు. వృద్ధాశ్రమ వ్యవస్థకు భారతీయ సంస్కృతి వ్యతిరేకమని అందుకే ఆ వ్యవస్థకు నాంది పలికి వృద్ధులకు కుటుంబసభ్యులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 

పిల్లల భవిష్యత్తు కోసం కష్టమంతా ధారపోసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పిల్లలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. కరోనా వైరస్ జీవన శైలిలో మార్పులు తీసుకు వచ్చిందని ప్రస్తుతం రోగాలు, పబ్బులు, పార్కులు అన్ని మూతపడ్డాయని అన్నారు. గత కొద్ది రోజులుగా ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మమతానురాగాలు పెంపొందాయని అన్నారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం, గురువులు అన్ని వారేనని అందుకే వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నిర్మల్ పట్టణ సిఐ జాన్ దివాకర్, ఆర్ఐ వెంకటి, ఎంటిఓ వినోద్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


logo