బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 15:42:58

కాంగ్రేసోళ్ళను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపాల్సిందే...

కాంగ్రేసోళ్ళను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపాల్సిందే...

కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రేస్‌ నాయకులపై ద్వజమెత్తారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మండిపడ్డారు ఎమ్మెల్యే. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్పంచాలని అన్నారు. మీ బ్రతుకంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే, పచ్చ కామెర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగనే అన్నట్లు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందన్నారు. వరుసగా ఓడిపోవడంతో మతిభ్రమించి, కండ్లుమండి మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే. వరుసగా ప్రతి ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన కాంగ్రెస్ నాయకులకు సిగ్గు రావడం లేదన్నారు ఎమ్మెల్యే రవిశంకర్‌.

 మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డిగుర్రాల పళ్ళుతోమారా అని ప్రశ్నించారు. 70 సంవత్సరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన మీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేసారు. ఇది రైతులు మర్చిపోరని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.4 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చారని గుర్తు చేశారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న సోయిలేదన్నారు. బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలకడానికే ఉన్నారని, కరోనా వైరస్‌తో రాష్ట్రంలో లాక్‌ డౌన్ ఉన్నా కూడా  రైతుల కోసం రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.1300 ల కోట్లు విడుదల చేశారని గుర్తు చేసారు ఎమ్మెల్యే. రైతులు ధాన్యం అమ్ముకున్న ఐదురోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని, కేంద్రప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందులకు ఇప్పటికీ రైతులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయలేదని తెలిపారు. దీనికి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్


logo