గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 15:23:53

సోమవారం నుంచి పోస్టాఫీస్‌ ద్వారా ఆర్థిక సాయం..

సోమవారం నుంచి పోస్టాఫీస్‌ ద్వారా ఆర్థిక సాయం..

కరోనా నేపధ్యంలో ఇళ్ళకే పరిమితమైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 రెండవ విడత ఆర్థిక సాయాన్ని పోస్టాఫీసుల ద్వారా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సోమవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు మంత్రి ట్విట్టర్‌ వేధికగా మంత్రి తెలిపారు. గత వారమే కొంత మందికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకే సారి వెళ్ళవద్దని, తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని మంత్రి సూచించారు.  మిగిలిన 5 లక్షల 38 వేల మందికి పోస్టాఫీసుల ద్వారా ఇవ్వనున్నట్లు, ఇందుకు సంబందించిన మొత్తాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. logo