బుధవారం 27 మే 2020
Telangana - May 09, 2020 , 15:02:01

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం....

సీఎం కేసీఆర్ చిత్రపటానికి  పాలాభిషేకం....

భద్రాద్రి-కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారనీ సహకార సంఘం అధ్యక్షులు లేళ్ల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లాక్‌ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా రైతుల రుణాల మాఫీ కోసం రూ.1200 కోట్లు విడుదల చేశారని, దీని ద్వారా 5.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వానాకాలం రైతుబంధు పథకం కోసం రూ.7 వేల కోట్లు విడుదల చేయటంతో 57 లక్షల మందికి సాయం అందుతుందన్నారు. రైతాంగం కోసం శ్రమిస్తున్న కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సోనిక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


logo