బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 07:06:17

పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

పాత హాల్‌టికెట్లతోనే పది పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు వేగం చేసింది. మార్చిలో జారీ చేసిన హాల్‌టికెట్లతోనే ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి జిల్లా విద్యాధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. పరీక్షా కేంద్రాలను పెంచిప్పటికీ పాత కేంద్రాల సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.


logo