బుధవారం 27 మే 2020
Telangana - May 09, 2020 , 06:40:22

డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌.. మాస్క్‌ లేకుంటే పట్టేస్తాయి!

డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌.. మాస్క్‌ లేకుంటే పట్టేస్తాయి!

హైదరాబాద్ : జరిమానా విధిస్తామన్నా మాస్క్‌ లేకుండా బయట తిరిగేవారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలతో డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నిక్‌తో మాస్కులు లేకుండా బయటికి వచ్చేవారి ఫొటోలను తీస్తున్నారు. ఈ- చలాన్‌ మాదిరిగానే వాహనదారులకు వాటి నంబర్‌ ఆధారంగా వారి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపిస్తారు. నిర్ణీత సమయంలో చలాన్లు చెల్లించకపోతే కఠిన చర్యలుంటాయి. మాస్క్‌ లేకుండా తిరిగేవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం తన ట్విట్టర్‌లో వివరించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు తీసుకొచ్చిన ఈ టెక్నాలజీని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అమలుచేస్తున్నట్టు తెలిపారు.


logo