ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 22:15:18

కనిపించే దైవాలు గాంధీ వైద్యులు

కనిపించే దైవాలు గాంధీ వైద్యులు

గాంధీ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి హరీష్‌ రావు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి పండంటి బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడం అందరినీ ఆలోచింపజేసింది. సాదారణ కరోనా రోగులను కాపడడంలోనే కాకుండా కరోనా వచ్చిన గర్భిణికి సురక్షితంగా పురుడుపోసిన గాంధీ వైద్యులపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేఖాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ట్విట్టర్‌ వేధికగా గాంధీ వైద్యులను అభినందించారు. ‘‘కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాధించిన మన గాంధీ ఆసుపత్రి వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతఙ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’ అని మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.logo