శనివారం 30 మే 2020
Telangana - May 08, 2020 , 22:10:43

బీర్ల కంటే హార్డ్‌కే మొగ్గు

 బీర్ల కంటే హార్డ్‌కే మొగ్గు


  లాక్‌డౌన్‌ 3.0 సడలింపుల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వైన్స్‌లు తెరుచుకోవడంతో పోటీ పడి మరీ మద్యం కొనుగోళ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వైన్‌ షాపులు తెరుచుకున్ననాటి నుంచి మద్యం డిపోల నుంచి వైన్‌ షాపులు కొనుగోలు చేసే మద్యం రోజురోజూకీ పెరిగిపో తున్నది. సాధారణంగా వేసవిలో బీర్లకు ఎక్కువ  డిమాండ్ న్నో ఉంటుంది. వైన్స్‌ల్లో కూల్ బీర్లు దొరకక మందుబాబులు గొడవలు చేసిన సందర్భాలెన్నో . అయితే, ఈ సారి మద్యం డిపోల నుంచి కొనుగోలు  చేస్తున్న లిక్కర్ లెక్కలు చూస్తుంటే మాత్రం.. బీర్ల కంటే హార్డ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.  లాక్‌డౌన్‌తో అన్ని షాపులు మూతపడడంతో.. వైన్స్‌ల్లో అప్పటికే కొంత మద్యం నిల్వ ఉంది.. దాంతో... మే 6వ తేదీన మద్యం డిపోల నుంచి కొనుగోలు చేసింది కేవలం రూ.72.5 కోట్ల విలువైన మద్యమే.. ఆ వెంటనే మరుసటి రోజు ఇది అనూహ్యంగా పెరిగిపోయింది.. మే 7న ఏకంగా రూ. 188.2 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు వైన్‌ షాపుల యజమానులు. శుక్రవారం  ఇది మరింత పెరిగింది.   


logo