ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 20:02:47

ప్రతిష్టాత్మకమైన ఐఐఎం అహ్మదాబాద్లో తెలంగాణ విద్యార్థికి చోటు...

ప్రతిష్టాత్మకమైన  ఐఐఎం అహ్మదాబాద్లో తెలంగాణ విద్యార్థికి చోటు...

ఐఐఎమ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) అహ్మదాబాద్ ఫిబ్రవరిలో నిర్వహించిన మౌఖిక పరీక్ష  (ఇంటర్వ్యూ) ఫలితాలు విడుదలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన వరకాంతం జంగారెడ్డి పుష్ప దంపతుల కుమారుడు హేమంత్ రెడ్డి ఐఐఎం అహ్మదాబాద్లో 99.13 శాతం మార్కులతో 2020- 22  విద్యా సంవత్సరంలో ప్రవేశార్హత సాధించాడు. ప్రస్తుతం వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌లో నివసించే హేమంత్ హైస్కూల్ చదువు నుండి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసాడు. ఏడాది కాలం పాటు టిసిఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే క్యాట్ పరీక్ష సన్నద్ధమై ఐఐఎం అహ్మదాబాద్లో అర్హత సాధించాడు.


logo